సైబర్ మోసలపై అవగాహన తప్పనిసరి : డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షేక్ షాబాజ్ అహ్మద్ భద్రత చట్టాలపై అవగాహన కార్యక్రమం....
. SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం.....డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ఆమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ,డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షేక్ షాబాజ్ అహ్మద్ అల్లవరం మండలం గోడి గ్రామంలోని డా.బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మహిళల భద్రతపై విద్యార్థినిలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షేక్ షాబాజ్ అహ్మద్ మాట్లాడుతూ యువత ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న వేధింపులు ఫేక్ కాల్స్,ఓటిపి మోసాలు,క్యూఆర్ కోడ్ స్కామ్స్ వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్,సందేశాలు,లింకులను నమ్మి వివరాలు,ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని,సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు మార్ఫింగ్ ఫోటోలు,బ్లాక్ మెయిలింగ్ వంటి నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.మొబైల్ ఫోన్లలో బలమైన పాస్‌వర్డ్లు మరియు టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ వినియోగించాలని సూచించారు.సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేయాలని, మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న శక్తి యాప్ ను ప్రతి మహిళ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్‌లోని ఎస్ఓఎస్ సదుపాయం ద్వారా పోలీస్ సహాయం వెంటనే పొందవచ్చనని వివరించారు.మహిళల భద్రత కోసం 181 హెల్ప్‌లైన్, అత్యవసర సేవల కోసం డయల్ -112,షీ టీమ్స్, పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అల్లవరం ఎస్ఐ సంపత్ కుమార్,గురుకుల పాఠశాల ప్రిన్సిపల్,విద్యార్థినిలు పాల్గొన్నారు.


Comments
Post a Comment