Skip to main content

పంతం" నీకిది తగునా.. స్థాయి మరవకండి : వంటెద్దు వెంకన్నాయుడు మీ దూకుడు ప్రజా సంక్షేమంపై చూపించండి..


.               SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...పంతం" నీకిది తగునా.. స్థాయి మరచి మాట్లాడడం సరికాదని వైస్సార్సీపీ కార్యదర్శి, మండపేట నియోజకవర్గ వైస్సార్సీపీ పరిశీలకులు వంటెద్దు వెంకన్నాయుడు అన్నారు.నాయుడు మాట్లాడుతూ మిమ్మల్ని మేము ఒరే అంటే ఎలా ఉంటుంది. విజ్ఞతతో ఆలోచించండి. మీ స్థాయికి జగన్మోహన్ రెడ్ది  వరకు ఎందుకు మేము చాలు. స్థాయి మర్చిపోవద్దు. తన్నితే బూరెలు పుట్టలో పడ్డట్టుగా ఎమ్మెల్యే అయ్యారు. ఓట్లు వేసిన ప్రజలకు ఏం కావాలో అది చూడండని సలహా ఇచ్చారు. కనీసం మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాపు కార్పొరేషన్ కి ఇస్తానన్న రూ 9వేల కోట్లు మంజూరు చెయించండి.  వైస్సార్సీపీ కాపు పెద్దలు వారి అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకుంటే మీకెందుకు ఉలుకు మీ వైఫల్యాలను ప్రశ్నిస్తారని భయమా! మీరు చెప్పిన143 హామీలు దేవుడెరుగు కనీసం సూపర్ 6 లో ఉన్న సంక్షేమం కూడా చేయలేకపోయారు. అందుకేనా ఈ ప్రస్టేషన్.మీ వైఫల్యాలను ప్రశ్నించకూడదా, ప్రజాజీవితంలో ఉన్న ఒక బాధ్యత గల నాయకుడు ఇలాగేనా మాట్లాడేది. మీలాంటి ఎమ్మ్మెల్యేని భరించవలసి రావడం మీ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న దురదృష్టమని అన్నారు.

Comments