Skip to main content

చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ..

            SRINIVAS SPL Correspondant 


విశాఖ సందేసం...మోసుగంటి గంగయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ కొమరగిరిపట్నం వారిచే బుధవారం ట్రస్ట్ అధ్యక్షులు మోసుగంటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి విజయ్ కుమారి సఖినేటిపల్లిలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి స్టీలు కంచాలు ( ప్లేట్లు)ను పంపిణీ చేశారు. కొమరగిరిపట్నం నుండి సఖినేటిపల్లి గ్రామం వచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజన కంచాలను అందించిన ట్రస్ట్ సేవలను,సేవా వితరణను ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి,యస్.టి.యు సంఘ నాయకులు గుబ్బల శ్రీనివాస్,గ్రామ పెద్దలు విజయ శేఖర్,సునీల్ , ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments