Skip to main content

శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం * భక్తి పారవశ్యంతో శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం. * అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు * భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు – సాంస్కృతిక కార్యక్రమాలతో జాతరకు వైభవం

                      K.V.SHARMA EDITOR 


సింహాచలం8062026సింహాచలంశ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి వారి కొండ దిగువన వెలసిన స్వామివారి సహోదరి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 9వ తేదీ మంగళవారం భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇఓ  తెలిపారు.

సాంప్రదాయం ప్రకారం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించిప్రత్యేకపూజలునిర్వహించనున్నారు. 


జాతర సందర్భంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలు, ప్రసాదాల పంపిణీ కేంద్రాలు, భక్తుల రాకపోకల ఏర్పాట్లను ఈవో శ్రీ జల్లేపల్లి వెంకటరావు పరిశీలించారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అమ్మవారి ప్రసాదాలు నిరంతరం అందే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు విద్యుద్దీపాల కాంతులతోశోభాయమానంగాఅలంకరించబడుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.


భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు సాంప్రదాయ కళారూపాల వైభవాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో పులి వేషాలు, తప్పెటగుళ్లు, కేరళ డ్రమ్స్, బేతాళ నృత్యాలు తదితర జానపద, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. ఈ కళారూపాలు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.


అలాగే పూర్వ తరాల సాంస్కృతిక సంపదను నేటి తరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో సోమవారం రాత్రి ప్రసిద్ధ “సత్యహరిశ్చంద్ర” నాటక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ధర్మం, సత్యం, త్యాగం వంటి విలువలను చాటిచెప్పే ఈ నాటకం భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనుంది.


అమ్మవారి జాతర మహోత్సవం కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తుందని, అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ పైడితల్లి అమ్మవారి కృపాకటాక్షాలను పొందాలని, నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి ఆనందించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు కోరారు.

Comments