Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. ​సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విమల్ కుమార్ యాదవ్, దంపతులు.

.                   K.V.SHARMA EDITOR 
సింహాచలం, జూన్ 07, 2026: ఢిల్లీ హైకోర్టు గౌరవనీయులైన న్యాయమూర్తి శ్రీ విమల్ కుమార్ యాదవ్ , వారి సతీమణి శ్రీమతి సత్య ప్రభ తో కలిసి ఈరోజు సింహాచలంలోని శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

​ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన గౌరవనీయులైన న్యాయమూర్తి దంపతులకు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి  కె. తిరుమలేశ్వరరావు  ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో న్యాయమూర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను మరియు చిత్రపటాన్ని అందజేశారు.

Comments