Skip to main content

నేటి నుంచి రాజయోగ మెడిటేషన్ శిక్షణ* *బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో* *నాలుగు రోజులు పాటు నిర్వహణ* *జర్నలిస్టులంతా సద్వినియోగం చేసుకోండి* *మానసిక శారీరక ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందండి* *బ్రహ్మకుమారి ల ఆధ్వర్యంలో నిర్వహణ*..


డాబాగార్డెన్స్.. జూన్ 4 
ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచిరాజయోగ మెడిటేషన్ శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు

బ్రహ్మకుమారి బి కే రామేశ్వరి తెలిపారు.. గురువారం విశాఖలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రామేశ్వరి మాట్లాడుతూ 

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి భావంతో ముందుకు సాగాలన్నారు. తమ

 మనోబలాన్ని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో పరమేశ్వరుని స్మృతితో నిత్య కర్మలను చేస్తూ కుటుంబ బాధ్యతను నిర్వహించాలన్నారు.. ఉద్యోగ వ్యాపారాలు సంభాలిస్తూ నిరంతరము ధ్యానస్థితిని పొందేందుకు మానసిక ఏకాగ్రతను పొందేందుకు మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు


రాజయోగ మెడిటేషన్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.. శారీరక మానసిక అనారోగ్యాన్ని తొలగించుకునేందుకు స్వయంగా భగవంతుడు నేర్పిస్తున్న సహజ రాజయోగ  మెడిటేషన్ కోర్సు ఉపకరిస్తుందన్నారు..సీతమ్మధార హెచ్ బి కాలనీ సేవా కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంకాలం 6 నుంచి 7:30 వరకు మెడిటేషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.. ఈ కోర్సు వరుసగా శుక్రవారం నుంచి నాలుగు రోజులు నిర్వహించడం జరుగుతుందన్నారు.. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మానసిక స్థిరత ఏకాంతత ప్రసన్నతను పొందేందుకు తరలి రావలసిందిగా కోరుతున్నట్లు చెప్పారు.. ప్రతి ఒక్కరూ ఈ రాజయోగ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని రామేశ్వరి పిలుపునిచ్చారు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు రాజయోగ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.. ఈ శిక్షణలో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరూ మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ప్రశాంతత పొందేందుకు ఉపకరిస్తుందన్నారు.. జర్నలిస్టుల కోసం ఇటువంటి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం పట్ల గంట్ల శ్రీనుబాబు బ్రహ్మకుమారిస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నిర్వాహకులు సీనియర్ కొరియోగ్రాఫర్ నాగరాజు పట్నాయక్ బ్రహ్మ కుమారీస్ తదితరులు 

Comments