Skip to main content

రాజ్యసభ సభ్యులు సాన సతీష్ ఘన స్వాగతం పలకాలి : టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు

.               SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....రెండవ  సారి  రాజ్యసభ సభ్యులుగా సాన సతీష్ ప్రమాణస్వీకారం చేసిన సందర్బంగా  ఘన స్వాగత వేడుకను విజయవంతం చేయాలని డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లంరాజు పిలిపు నిచ్చారు. తన స్వగృహం లో ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో సన్మానోత్సవ కార్యక్రమం వివరాలు తెలిపారు . సానా సతీష్ బాబు కు రావులపాలెం సెంటర్ లో అక్కడ నేతలు ఘన స్వాగతం పలికిన తరువాత కార్ల ర్యాలీగా అంబాజీపేట చేరుకుంటారని పల్లంరాజు తెలిపారు. 


అక్కడ నుంచి బైక్ ర్యాలీగా అమలాపురం గడియార స్తంభం సెంటర్ కు చేరుకుంటారు. నల్లవంతెన వద్ద గల సత్యనారాయణ గార్డెన్స్ చేరుకుని అక్కడ వేలాది మందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పౌర సమావేశంలో పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంధం పల్లంరాజు కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ మాట్లాడుతూ ఈ సమావేశానికి అధిరథ మహారధులు తరలివస్తున్నారని అన్నారు. ముఖ్యంగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ బాలయోగి శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పంచకర్ల రమేష్, అయితా బత్తుల ఆనంద రావు, దాట్ల బుచ్చిబాబు, బండారు సత్యానందరావు, గిడ్డి సత్యనారాయణ, కన్నా లక్ష్మి నారాయణ, పంతం నానాజీ, దేవ ప్రసాద్, గొల్లపల్లి అమూల్య,ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పేరాబత్తుల రాజశేఖర్, ఆదిరెడ్డి వాసు, కాపు నాయకులు అరేటి ప్రకాష్, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి యేసు దాసుతో పాటు పలువురు ప్రముఖులు వస్తారని గణేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మోకా సుబ్బారావు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బోనం సత్య వరప్రసాద్, కొమ్ములు సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments