గడియార స్తంభం సెంటర్లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ... చిన్నారి నిత్విక హత్య వెనుక ఉన్న వారిని తక్షణమే అరెస్టు చేయాలి...
SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం పట్టణంలో స్థానిక గడియార స్తంభం వద్ద రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు ఆదేశాల మేరకు కడప జిల్లా పులివెందుల లింగాలపల్లిలో జరిగినటువంటి అమానుష ఘటనపై అమలాపురం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నర్వహించి నిరసన తెలియజేశారు.
ఈ నేపథ్యంలో కట్టొజు సన్నాయి దాసు మాట్లాడుతూ నిత్విక హత్య వెనక ఉన్నటువంటి వారిని వెంటనే శిక్షించాలని ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేయాలని కోరారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుపాటి వేణుగోపాల్ మాట్లాడుతూ ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి అమానుష ఘటనలు జరగటం చాలా దురదృష్టకరమని హోంమంత్రి అనిత వెంటనే హత్య వెనుక ఉన్న వారిని అరెస్టు చేయించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఇటువంటి ఘటనలు మరలా పునావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విశ్వబ్రాహ్మణ కుటుంబానికి ఆర్థికంగా సాయం అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోసూరి చిదంబరాచారి సహాయ కార్యదర్శి బొల్లోజు మణి శ్రీకాంత్, చేబ్రోలు గంగా నాగేశ్వరరావు, సిరగాడపల్లి అమృత లింగం, మడా శివకుమార్ కర్రీ చినబాబు, కొమ్మోజి బ్రహ్మాజీ, గున్నేపల్లి భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment