K.V.SHARMA EDITOR
ఆంధ్రప్రదేశ్ న్యూస్ :తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు-మా (ఆంధ్రప్రదేశ్) మూడవ వార్షికోత్సవం సంబరాలు బందర్ రోడ్డు, గవర్నర్ పేట, బాలోత్సవ్ భవన్ ఫంక్షన్ హల్ లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా|| బెల్లం జయ కుమార్ గుప్తా,గౌరవ అధ్యక్షులు ఆశీర్వాద్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యక్రమం కు గౌరవ ముఖ్య అతిథులుగా "ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి, అధ్యక్షుడు, సీనియర్ సినీ నటుడు,హ్యాపీ రిసార్ట్స్ అధినేత గౌరవనీయులు "అంబటి మధుమోహన్ కృష్ణ" ప్రముఖ దర్శకుడు, ఎస్,ఎస్, స్వామి, వశిష్టత బి.ఆర్.ఆగ్రో ఫార్మ్, రవికుమార్, రెడ్ బ్రిక్స్ అధినేత, చింత పవన్ కుమార్, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అధ్యక్షుడు,బండారు వెంకటరమణ, జనసేన యువ నాయకులు, వంగవీటి రాధాకృష్ణ ఆహ్వానించగా! తెలుగు మా అసోసియేషన్ కార్యక్రమం లో "ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అధ్యక్షుడు " అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో మొదలవడం ఎంతో అవసరమని రెండు తెలుగు రాష్ట్రాల్లో సమానంగా తెలుగు సినిమా ఎదగాలని దానికి సంబంధించిన ఇరవై నాలుగు విభాగలకు కావలిసిన మౌళిక వనరులు 'కృ' టీమ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రకృతి రమణీయ,సుదర, అద్భుతమైన, సినిమాకి కావాల్సిన అన్నీ హంగుల ప్రకృతి వరప్రసాదమైన మంచి లొకేషన్స్ ఉన్నాయని వాటిని ఉపయోగించుకొని నిర్మాత,దర్శకులు మంచి సినిమాలు నిర్మించాలని,
ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అన్ని సినిమాలకి తమ వంతు సహాయ, సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా మధు మోహన్ కృష్ణ తెలియజేశారు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, బండారు వెంకట రమణ మాట్లాడుతూ సినిమా రంగాన్ని పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలని పోస్ట్ ప్రొడక్షన్,డి.ఐ కూడా ఇక్కడే వచ్చే ఏర్పాటు చేయాలని కోరారు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా సినిమా నిర్మించే నిర్మాతలకు 25లక్షలు రాయితీ ఇవ్వాలని పేర్కొన్నారు! ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.స్వామి, వశిష్టత బి.ఆర్,అగ్రో ఫార్మ్, రవికుమార్, రెడ్ బ్రిక్స్ అధినేత, చింత పవన్ కుమార్ మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారి తండ్రి నాటక రంగంలో ఎన్నో సేవలు అందించారు, అందుకే ఆయనకు సినిమాలు మీద మంచి మక్కువ,అవగాహన ఉందని ఆయన తెలియజేశారు! కళ్యాణ్ రాజా కరుటూరి అలియాస్ (జూనియర్ పవన్ కళ్యాణ్) ఆయన త్వరలో ప్రారంభించబోయే సినిమా పోస్టర్ ని "తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవ" వేదిక పై "అంబటి మధుమోహన్ కృష్ణ చేతుల మీదుగా పోస్టర్ ని ఆవిష్కరించారు! ఈ చిత్రానికి రామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నిర్మాత కాగా, ఆయన గతంలో రెండు చిత్రాలకి నిర్మాతలగా మంచి విజయం అందుకున్నారు అని కళ్యాణ్ రాజా పేర్కొన్నారు! అనంతరం "తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు మా (ఆంధ్రప్రదేశ్) కళాకారులు సభ్యులకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్అధ్యక్షుడు, అంబటి మధుమోహన్ కృష్ణ చేతుల మీదుగా తెలుగు మా సంస్థ కళాకారుల గుర్తింపు కార్డులకు అందచేయడం జరిగింది! కార్యక్రమంలో మూడు నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది, నూతన జిల్లా కార్యవర్గానికి!"తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు మా {ఆంధ్ర ప్రదేశ్}" వ్యవస్థాపక,అధ్యక్షులు డా|| పూతి వెంకట రెడ్డి 2026-27 సంవత్సర కార్యవర్గ విస్తరణలో భాద్యతలు స్వీకరించిన నూతన కార్యవర్గ ప్రతీ కళాకారులకు కృతజ్ఞతలు, కళాభివందనాలు, శుభాకాంక్షలు తెలుపుతూ అసోసియేషన్ నటీ,నటులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని. సినిమా పరిశ్రమ షూటింగ్లలో నటీ,నటులు కి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడితే, లిఖిత పూర్వకంగా తెలియజేస్తే వారికీ మన అసోసియేషన్ అండగా ఉంటుందని దానికి గాను నటీ,నటులు అసోసియేషన్ యొక్క విధి,విధానాలు పాటించడం, కర్త కర్మ,క్రియల యందు నిబద్ధతగా ఉండి, నిబంధనలు తూచా తప్పక పాటించాలని అధ్యక్షులు తెలియజేశారు, తెలుగు మా అసోసియేషన్ ద్వారా వచ్చే చిన్న నిర్మాతల, సినిమా నిర్మాణా సంస్థకు సంబంధించి తమవంతుసహాయ,సహకారాలు తెలుగు మా కళాకారుల తరఫున ఉంటుందని, ఎల్లప్పుడూ కళాకారులను అభివృద్ధి చేయడంలో తాము ఎల్లప్పుడూ ముందు ఉంటామని కళావేదిక సాక్షిగాతెలియజేశారు,
కళాకారులందరూ కలిసికట్టుగా, ఐకమత్యంతో ముందుకు సాగాలని 'తెలుగు మా అసోసియేషన్'వ్యవస్థాపక,అధ్యక్షుడు ,ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి విశాఖ జిల్లా కోఆర్డినేటర్ నిర్మాత మండలి సభ్యుడు డా || పూతి వెంకటరెడ్డి "తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్" సభ్యులు సూచించారు! ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆ దేవదేవుని ప్రార్థించారు, ఆయన ఆరోగ్యం బాగో లేనప్పటికీ కార్యక్రమం ను ఫోన్ లైవ్ వీడియో కాల్ ద్వారా విక్షించారు, సంస్థ ప్రధాన కార్యదర్శి, డా||బెల్లం జయకుమార్, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి, పులుకురి సతీష్ కుమార్, ఇంకొక కార్యనిర్వాహక కార్యదర్శి, విశాఖ జిల్లా నూతన అధ్యక్షులు, వై.రాజశేఖర్, మహిళా విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి, గుండాల విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు,పాండురంగ విట్టల్, కార్యనిర్వాహక కార్యదర్శి, మోడీ సాయి చైతన్య, సంయుక్త కార్యదర్శి, విశాఖ జిల్లా నూతన కోశాధికారి, నటి, గుండాల సౌమ్య, కృష్ణ జిల్లా అధ్యక్షుడు, చల్లా బాలు, కార్యదర్శి, ప్రశాంత్, కోశాధికారి కార్యనిర్వాహక కార్యదర్శి, శిరీష, సంయుక్త కార్యదర్శి, గిరిజా రమణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది! తెలుగు-మా అసోసియేషన్(ఆంధ్రప్రదేశ్) వ్యవస్థాపక, అధ్యక్షుడు డా||పూతి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన కళాకారులందరు(నటి,నటులు) పాల్గొని కార్యక్రమాని దిగ్విజయం చేయడం జరిగింది!




Comments
Post a Comment