భవన నిర్మాణాలు, ఎల్ఆర్ఎస్ మంజూరు లపై ప్రణాళికాధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచండి. * విధుల నిర్వహణలో జాప్యం కనబరిచినా, అవినీతికి పాల్పడినా శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవు. *జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం, జూన్ 4: విశాఖ నగర పరిధిలో గల భవన నిర్మాణాల అనుమతులు, ఎల్ఆర్ఎస్, టి డి ఆర్ ల మంజూరులపై జాప్యం లేకుండా నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ,విధుల నిర్వహణలో జాప్యం కనబరిచినా, అవినీతికి పాల్పడినా శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పట్టణ ప్రణాధికా అధికారులకు ఆదేశించారు. గురువారం ఆయన చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకర రావు, ఇతర ప్లానింగ్ అధికారులతో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశం హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలు తమ భవనాలు నిర్మించుకునేందుకు అనుమతులు కోరుతూ జీవీఎంసీ కి పలు అర్జీలు పెట్టిఉన్నారని వాటిని సకాలంలో పరిష్కరించడంలో చాలా జాప్యం టౌన్ ప్లానింగ్ అధికారులు కనబరుస్తున్నారని ,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా ఎల్ఆర్ఎస్ మంజూరు ప్రక్రియలో కూడా జాప్యం కనపరుస్తున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్, టిడిఆర్ మంజూరుల ప్రక్రియలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా అధికారులు పనిచేయాలని, అవినీతికి పాల్పడినట్లు తేలినా లేదా ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ హెచ్చరించారు. విధుల నిర్వహణలో జాప్యం, నిర్లక్ష్యం, అవినీతి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు."
ఏపీ డి పి ఎం ఎస్ పోర్టల్ ద్వారా నమోదైన బిల్డింగ్ అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి రెండు రోజులు కంటే ఎక్కువగా జాప్యం లేకుండా వెంటనే పై అధికారులకు పంపించి భవన నిర్మాణాల మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎల్ఆర్ఎస్ లను కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని, ప్రణాళిక అధికారులు, సర్వేయర్ల విధి నిర్వహణలో, లైసెన్సుడ్ టెక్నికల్ పర్సన్స్ అనుమతుల నమోదు ప్రక్రియలో కూడా జాప్యం, లోపాలు కనిపిస్తున్నాయని ఇకపై జాప్యానికి కనబరిస్తే సహించేది లేదని కమిషనర్ హెచ్చరిస్తూ పరిష్కార దిశగా ప్రణాళికయుతమైన చర్యలను వెంటనే చేపట్టాలని చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావుకు కమిషనర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి, డిసిపిలు మధుసూదనరావు ,రామ్మోహన్, ఏసీపీలు తిరుపతిరావు, రామలింగేశ్వర రెడ్డి, ఝాన్సీ, లక్ష్మి సబ్నం శాస్త్రి, రామకృష్ణ, టిపివోలు, టీపీబివోలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి జివిఎంసి



Comments
Post a Comment