. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....సిఐటియు నాయకురాలు అంగన్ వాడీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షరాలు ఉప్పలగుప్తం పంచాయతీ కోటుంవారి పేటకు చెందిన పి.బేబీ గంగా రత్నం పోరాటాలు, సేవలు స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. బేబీ గంగా రత్నం ఇటీవల అంగన్ వాడీ టీచర్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా బేబీ గంగా రత్నంను ఆమె స్వగృహంలో అనురాధ దుశ్శాలువా కప్పి సత్కరించారు. అనంతరం అనురాధ మాట్లాడుతూ బేబీ గంగారత్నం సమాజానికి వృత్తికి అంకితభావంతో పని చేశారని అన్నారు. కార్మికులు అంగన్ వాడీ ల హక్కుల కోసం నిరంతరం చేసిన పోరాటాలు ఎప్పటికి గుర్తుంటాయని అన్నారు. బేబీ గంగా రత్నంను సత్కరించిన వారిలో సత్యం కాపు, శేఖర్, స్వర్ణ తదితరులు ఉన్నారు

Comments
Post a Comment