కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు... ప్రజా పాలన, అభివృద్ధికి నిదర్శనం* *▪️ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం* *▪️ విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించిన చంద్రబాబు నాయకత్వం* *-- టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*
అమరావతి: విశాఖ సందేశం : జూన్ 4:* కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 4 కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు గుర్తు మాత్రమే కాదని, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు గెలిచిన చారిత్రాత్మక దినమని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందన్నారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి ప్రజా ప్రయోజన నిర్ణయాలతో పాలనకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం 2.0, స్త్రీ శక్తి వంటి పథకాల ద్వారా రైతులు, మహిళలు, విద్యార్థులు, పేద కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు
యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని పల్లా తెలిపారు. ఇప్పటికే లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందన్నారు. కేవలం రెండేళ్లలోనే భారీ పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది ఉద్యోగ అవకాశాలకు బాటలు వేసిందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, విశాఖ రైల్వే జోన్ సాధన, రహదారుల అభివృద్ధి, పేదల గృహ నిర్మాణం వంటి కీలక కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి నిదర్శనమన్నారు.
మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, రైతులు, మహిళలు, యువత సహా ప్రతి వర్గం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్య సాధన దిశగా రాష్ట్రాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తూ, పేదరికం లేని సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు

Comments
Post a Comment