. K.V.SHARMA EDITOR
విశాఖ: విశాఖ సందేశం వార్తలు :18,జూన్:రాజమండ్రిలో జూలై 19న నిర్వహించే రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి విశాఖ నుంచి పెద్ద ఎత్తున బ్రాహ్మణులు తరలి రావాలని నిర్వాహకులు భమిడిపల్లి వెంకట రమణమూర్తి ,భాగవతి అయ్యప్ప తదితర బ్రాహ్మణ పెద్దలు కోరారు.గురువారం విశాఖలో పర్యటించిన నిర్వాహకులు రాష్ట్ర అర్చక పురోహిత సమాఖ్య విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం బ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నెమ్మలూరి శివగణేష్ శర్మ,అయిలూరి నాగ శాస్త్రి, మాజీ కార్పొరేటర్ రాపర్తి కన్నా, బ్రాహ్మణ ప్రముఖులు సుబ్రహ్మణ్యం, తదితరులను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రిక అందచేసి రాష్ట్రస్థాయి సమావేశానికి విశాఖపట్నం నుంచి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు తరలిరావాలని కోరారు.సానుకూలంగా స్పందించిన విశాఖ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి జెఏసి తరపున అందుకూరి కిరణ్, సుసర్ల హరి కొంతమంది బ్రాహ్మణ సంఘాలు పెద్ద ఎత్తున బ్రాహ్మణ కుటుంబాలతో సహా తరలివస్తామని తెలిపారు.ఆర్థికంగా కూడా తగిన సహాయం చేస్తామని ఈ సందర్భంగా నిర్వాహకులకు హామీ ఇచ్చారు.

Comments
Post a Comment