Skip to main content

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు బెండమూర్లంక పీహెచ్‌సీలో పల్స్ పోలియో కార్యక్రమం....

               SRINIVAS SPL Correspondant 


అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలం  బెండమూర్లంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సి) పరిధిలో 0–5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు ఇళ్ల శేషగిరిరావు , జెడ్పీటీసీ సభ్యురాలు   కె. గౌతమీ మహేష్ , వైస్ ఎంపీపీ  ముత్యాల రామకృష్ణ,  పల్లి జేమ్స్  హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా తల్లిదండ్రులు సహకరించాలని వైద్యాధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ నాయకులు యాళ్ల కాసు బాబు,  ముత్యాల ఎస్.వి. ప్రసాద్, వైద్యాధికారులు డా. సూర్య నాగేష్, డా. సాయి సుస్వర, సూపర్‌వైజర్లు ఎన్.ఎల్.వి. రంగనాథ్, కె. సుజాత, స్టాఫ్ నర్స్ ప్రసన్న కుమారి, ఫార్మసిస్ట్ పుష్ప సత్య, ల్యాబ్ టెక్నీషియన్ స్వామి, హెల్త్ అసిస్టెంట్లు సత్యనారాయణ, వినయ్, ఇతర ఆరోగ్య సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Comments