నగరంలో సందడిగా "హ్యాపీ సండే" కార్యక్రమాలు. *హ్యాపీ సండే కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్న కాలనీవాసులు, నివాసిత సంక్షేమ సంఘాలు, సీనియర్ సిటిజెన్లు, యువతీ యువకులు, చిన్నారులు, నగర ప్రజలు. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
K.V.Sharma EDITOR
విశాఖపట్నం, జూన్ 28: విశాఖ నగరంలో అన్ని జోన్ల పరిధిలో సందడిగా "హ్యాపీ సండే" కార్యక్రమాలు ఆదివారం అద్భుతంగా నిర్వహించడమైనదని , హ్యాపీ సండే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో ఉత్సాహంగా ప్రజలు ,నివాసిత సంక్షేమ సంఘాలు, విద్యార్థినీ విద్యార్థులు ,సీనియర్ సిటిజనులు, వాకర్స్ క్లబ్ అసోసియేషన్లు , స్వయం సహాయక సంఘ సభ్యులు , ఆర్పీలు పాల్గొని హ్యాపీ సండే కార్యక్రమాన్ని జయప్రదం చేశారని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, సామాజిక ఐక్యత మరియు కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఉదయం 6:00 గంటల నుండి 9:00 గంటల వరకు పార్కులు, ఓపెన్ స్పేసులు, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు, క్రీడా ప్రాంగణాలు ,బహిరంగ ప్రదేశాలు వంటి ప్రదేశాలలో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయని ఆరోగ్య పరిరక్షణ , క్రీడలు, యోగా, పాటలు, ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలు , సాంస్కృతిక మరియు వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించి ఉత్సాహభరిత వాతావరణం కల్పించామన్నారు.
"
హ్యాపీ సండే జోన్ వారీ కార్యక్రమాల వివరాలు: "
భీమిలి జోన్– 4 వ వార్డు చేపలు ఉప్పాడ లో యోగ కార్యక్రమాలు. మధురవాడ జోన్ - 7వ వార్డులో స్వతంత్ర నగర్ పార్క్ లో 100 మందితో ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలు, ఈస్ట్ జోన్ 15 వ వార్డు జే ఆర్ నగర్ లో చిన్నారులకు కరాటే శిక్షణ కార్యక్రమాలు, నార్త్ జోన్–49వ వార్డు వైభవ్ పార్కు లో చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు అవగాహన కార్యక్రమాలు. వెస్ట్ జోన్–52 వార్డు ఉడా లేఔట్ వాకర్స్ పార్కులో 50 మంది వాకర్స్ అసోసియేషన్ ,పతంజలి యోగ బృందం తో యోగ, చిన్నారులకు బ్యాడ్మింటన్ శిక్షణ, అవగాహన కార్యక్రమాలు. పెందుర్తి జోన్ 96వ వార్డు వేపగుంటలో 50 మంది స్వయం సహాయక సంఘ సభ్యులతో యోగా కార్యక్రమాలు. గాజువాక జోన్,-73 వ వార్డు కొత్త కర్ణ వాని పాలెం 30 మంది ఎస్ హెచ్ జి మహిళలు, స్థానికులతో యోగా కార్యక్రమాలు.అగనంపూడి జోన్- 85 వార్డు లో 40 మంది స్థానికులకు అవగాహన, చిన్నారుల తో క్రీడలు కార్యక్రమాలు.అనకాపల్లి జోన్ వార్డు 84 రింగ్ రోడ్ కరాటే స్కూల్లో లో 25 చిన్నారులకు మార్షల్ ఆర్ట్స్ కరాటే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగస్వామ్యులైన అందరికి కమిషనర్ అభినందనలు తెలుపుతూ తదుపరి జరుగబోయే “హ్యాపీ సండే” కార్యక్రమాలలో మరింత మంది పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ



Comments
Post a Comment