Skip to main content

ప్లంబర్లుకు భారీ ఉద్యోగ అవకాశాలు: జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి. హరి శేషు

.            Srinivas SPL Correspondant 
అమలాపురం, :విశాఖ సందేసం......డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిశుభ్ర ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన పైప్డ్ నేచురల్ గ్యాస్ (పి.ఎన్. జి ) కనెక్షన్ల కార్యక్రమంలో భాగంగా గృహాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర వాణిజ్య సంస్థలకు గ్యాస్ కనెక్షన్లు అందించడానికి ప్లంబర్లు మరియు ఫిట్టర్లకు భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి (డి.ఎస్.డి ఓ ) డి. హరి శేషు ఒక ప్రకటనలో తెలియజేశారు. సంబంధిత రంగాలలో నైపుణ్యాలు, అనుభవం లేదా అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎంపికైన అభ్యర్థులకు పి.ఎన్.జి  గ్యాస్ కనెక్షన్ల ఏర్పాటుకు సంబంధించిన పనుల్లో ఉపాధి కల్పించబడుతుందని తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 95159 12468 నంబర్‌ను సంప్రదించవచ్చు. అలాగే ఆన్‌లైన్ నమోదు (Registration) కొరకు 26-06-2026 తేదీన జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయం, అమలాపురం నందు సంప్రదించాలని సూచించారు.

Comments