Skip to main content

భవిష్యత్తు డిజిటల్ ఎకానమీకి ఏపీ కీలక గమ్యస్థానం: సీఎం చంద్రబాబు

                       K V SHARMA EDITOR


అమరావతి,జూన్ 02: భవిష్యత్తు డిజిటల్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్ హబ్‌గా విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఆసియా-పసిఫిక్‌లో ప్రముఖ హైపర్‌స్కేల్ డిజిటల్ ఇన్‌ఫ్రా సంస్థ ఎయిర్‌ట్రంక్ వ్యవస్థాపకుడు రాబిన్ ఖుదాతో సమావేశమైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ‘Choose Speed Choose AP’ నినాదంతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయనకు వివరించినట్లు తెలిపారు.విశాఖపట్నంలో 2 గిగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై రాబిన్ ఖుదాతో సంప్రదింపులు జరిపినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఏఐ, క్లౌడ్, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలకు విశాఖ కేంద్రంగా మారనుందన్నారు. ప్రపంచ స్థాయి డిజిటల్ ఎకోసిస్టమ్ నిర్మాణమే లక్ష్యమని సీఎం చంద్రబాబు వివరించారు. క్లీన్ ఎనర్జీ, కనెక్టివిటీ, నైపుణ్య యువతతో ఏపీకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయని సీఎం చంద్రబాబు వివరించారు.

యువతకు ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాబిన్ ఖుదాకు సీఎం చంద్రబాబు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగస్వామ్య అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. పర్యావరణ హిత, సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రాబిన్ ఖుదాకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

భవిష్యత్త్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై రాబిన్ ఖుదాతో చర్చించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు వివరించారు.


Comments