విశాఖ: విశాఖ సందేశం వార్తలు :ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రకృతి అద్భుతాల స్ఫూర్తితో రూపొందించిన తమ సరికొత్త సహజ వజ్రాభరణాల కలెక్షన్ ‘నువా’ను విశాఖపట్నంలో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పీ. అహ్మద్ మాట్లాడుతూ . ప్రకృతి అందాలలో దాగి ఉన్న సూక్ష్మ నిర్మాణాలు, ఆకృతుల సౌందర్యాన్ని ఆభరణాల రూపంలో ఆవిష్కరించడమే ‘నువా’ కలెక్షన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేటి మహిళల జీవనశైలికి అనుగుణంగా, సరళమైన విలాసాన్ని కోరుకునే వారి కోసం ఈ డిజైన్లను రూపొందించినట్లు చెప్పారు. అత్యుత్తమ నైపుణ్యంతో తయారైన ఈ ఆభరణాలు కాలాతీతమైన అందాన్ని ప్రతిబింబిస్తాయని, తరతరాల పాటు ఆదరణ పొందేలా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ప్రకృతిలో కనిపించే సున్నితమైన ఆకృతులు, తేనెగూడు నమూనాలు, భూమి సహజ నిర్మాణాలు మరియు జీవంతో నిండిన ప్రకృతి రూపాల నుంచి ప్రేరణ పొంది ఈ ప్రత్యేక కలెక్షన్‌ను రూపొందించినట్లు తెలిపారు
ఈ కలెక్షన్‌లో 14 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన ఆభరణాల్లో సహజ వజ్రాలతో పాటు రంగురంగుల రత్నాలు, సిరామిక్ రంగు ఎనామెలింగ్, బహువర్ణ రోడియం ఫినిష్‌లను వినియోగించినట్లు పేర్కొన్నారు. ఆధునికత, విలాసవంతమైన శైలి, సున్నితమైన కళాత్మకత కలగలిపి రూపొందించిన ఈ ఆభరణాలు వివిధ సందర్భాల్లో ధరించేందుకు అనువుగా ఉంటాయని తెలిపారు. ఈ కలెక్షన్‌కు ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని, ఆమె సొగసు, ఆత్మవిశ్వాసం, ఆధునిక మహిళా వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలుస్తారని సంస్థ పేర్కొంది. అందువల్ల ‘నువా’ కలెక్షన్ భావనకు ఆమె సముచితంగా సరిపోతారని వివరించింది. 1993లో స్థాపించబడిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రస్తుతం ప్రపంచంలోని 14 దేశాల్లో 445కు పైగా షోరూమ్‌లతో సేవలందిస్తోంది. నాణ్యత, విశ్వసనీయత, వినూత్న డిజైన్లకు ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. అలాగే సంస్థ తన లాభాల్లో కొంత భాగాన్ని విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు.

Comments
Post a Comment