శ్రీ స్వామి వివేకానంద సంస్థ నందు, ప్రముఖ సంఘ సేవకులు, J. సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్న తరుణంలో వివేకానంద సంస్థ వారు ప్రతిరోజు రాగిజావను , రద్దీగా ఉన్న జంక్షన్ లలో మొబైల్ చలివేంద్రాల ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు, సంస్థ వారిని ఆదర్శంగా తీసుకొని బాటసారులకు, ఆటో డ్రైవర్లకు, ఈ నేపథ్యంలో సూర్యనారాయణ రెడ్డి ఈరోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు . ఈ సేవా కార్యక్రమంలో తనకు భాగస్వామ్యం కల్పించినందుకు సంస్థ వారికి అభినందనలు తెలియజేశారు. సూర్యుని భగభగలు 46 డిగ్రీలు, 48 డిగ్రీల వేడితో, ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్న తరుణంలో కూడాG.V.M.C. వారు చలివేంద్రాలను నిలిపివేయడం చాలా బాధాకరంగా ఉందని సంస్థ అధ్యక్షులు అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు, వెంటనే జీవీఎంసీ చలివేంద్రాలను తెరవాలని ఆయన కోరారు.

Comments
Post a Comment