ఆంధ్రవిశ్వవిద్యాలయం, జూన్ 11: కృత్రిమ మేధను పరిమితులు తెలుసుకుని వినియోగించాలని ఐ.ఐ.ఎస్.ఇ ఆచార్యులు కొండూరి ఆదిత్య అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో గురువారం ఆయన ది పాస్ట్,ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ సైంటిఫిక్ కంప్యూటింగ్- రోల్ ఆఫ్ ఎం.ఎల్, ఏ.ఐ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైంటిఫిక్ కంప్యూటింగ్ ప్రగతి, వికాసాన్ని వివరించారు. అదే విధంగా కృత్రిమ మేధ పరమితులు తెలసుకుంటూ పనిచేయాలన్నారు. దీనిని పూర్తిస్థాయిలో విశ్వసించడం, ఆధారపడటం సరికాదన్నారు. దాని పరమితులను తెలుసుకుని, వినియోగంపై జాగరూకతతో వ్యవహరించాలన్నారు.
ఐఐటి ఖర్గపూర్ ఆచార్యులు విక్రాంత్ రాచెర్ల ఎస్టాబిలిష్‌మెంట్ - ఎఫిక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ డు ఇట్ యువర్ సెల్ఫ్(డి.ఐ.వై) ల్యాబ్ అనే అంశంపై ప్రసంగించారు. ఇంజనీరింగ్ ప్రధమ సంవత్సరంలో అడుడిగే విద్యార్థులకు ఉపయుక్తంగా నిలచే డిఐవై ల్యాబ్ ఏర్పాటు చేయడం, దీనిలో విభిన్న శాస్త్ర విభాగాలకు చెందిన విద్యార్థులు పనిచేయడం, స్వీయ ప్రయోగాలు, నూతన జ్ఞానాన్ని పొందుతూ, ప్రేరణ పొందే విధానాన్ని వివరించారు. ఇటువంటివి విద్యార్థులతో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాయన్నారు.
అనంతరం రైల్వే వ్యవస్థలో వివిధ ట్రైన్‌లలో బ్రేకింగ్ వ్యవస్థను సైతం వివరించారు. దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలలో డిఐవై ల్యాబ్‌లను నిర్వహిస్తున్న విధానం, ఇవి ఒక శాస్త్ర విభాగం విద్యార్థులకు విభిన్న శాస్త్ర అంశాలపై అవగాహన పెంచే విధంగా కృషి చేస్తున్న విధానం వివరించారు. ఏయూలో డిఐవై ల్యాబ్ ఏర్పాటు ఆలోచనను స్వాగతించారు. కేంద్రీయ విద్య సంస్థల తరహాలో ఏయూ ఈ దిశగా డిఐవై ల్యాబ్ స్థాపనకు ఆసక్తి చూపడాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా అతిధులను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ సత్కరించి, వర్సిటీ తరపున జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.శశి, డీన్ ఆచార్య వి.వల్లి కుమారి, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




Comments
Post a Comment