Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత.

.                   K.VSharma Editor 

సింహాచలం, జూన్ 29:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, సింహాచలాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని  పూజలు నిర్వహించారు.

మంత్రి ఆలయానికి చేరుకోగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు, ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులు నాదస్వర మంగళవాద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ ఘనంగా స్వాగతం పలికారు.


అనంతరం మంత్రి ముందుగా అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకుని 

దర్శనం అనంతరం వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేయగా, దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు మంత్రికి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, జ్ఞాపికను అందజేశారు


Comments