Skip to main content

​శ్రీ కె. సదారావు గారికి పదోన్నతి శుభాకాంక్షలు


విశాఖ: విశాఖ సందేశం వార్తలు
:సమాచార పౌర సంబంధాల శాఖ జోన్ - 1 రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా శ్రీ కె. సదారావు గారు బుధవారం నాడు అత్యంత ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా (DPRO) తనదైన శైలిలో ఉత్తమ సేవలు అందిస్తూ, మీడియా రంగానికి, ప్రభుత్వానికి వారధిగా నిలిచిన సదారావు గారి కార్యదక్షతకు ఈ పదోన్నతి దక్కింది.

​ఆయన ప్రతిభను, నిబద్ధతను గుర్తిస్తూ ప్రభుత్వం జాయింట్ డైరెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రీజినల్ జాయింట్ డైరెక్టర్ బాధ్యతలతో పాటు, విశాఖ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించాలని ఆ శాఖ డైరెక్టర్ శ్రీ కె.ఎస్. విశ్వనాథన్ గారు ఆదేశాలు జారీ చేశారు.

​ఈ అదనపు బాధ్యతలను కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తూ, జోన్ - 1 పరిధిలో సమాచార శాఖను మరింత ముందుకు తీసుకెళ్తారని మనసారా కోరుకుంటూ 

                        కె. వి. శర్మ, 

                        ఎడిటర్,

                    విశాఖ సందేశం 


Comments