విశాఖపట్నం.:విశాఖ సందేశం : విశాఖపట్నం 2026-27 విద్యా సంవత్సరానికి గాను సెయింట్ జోసెఫ్స్ మహిళా కళాశాలలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ తెలిపారు. ముఖ్యంగా ఎంబీఏ (MBA) మరియు ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
అదేవిధంగా ఎంబీఏ మేనేజ్‌మెంట్ కోర్సులో కూడా సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు కళాశాల పనివేళల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో సంప్రదించాలని కోరారు.
డిగ్రీ ప్రవేశ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని, కళాశాలలో వివిధ మేజర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కంప్యూటర్. బి కామ్, హోమ్ సైన్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ , జూఆలజీ, బోటనీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, జర్నలిజం, సైకాలజీ, ఎకనామిక్స్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని వివరించారు.
నాణ్యమైన విద్య, ఆధునిక బోధన విధానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ద్వారా విద్యార్థినుల భవిష్యత్తు నిర్మాణానికి కళాశాల కృషి చేస్తోందని డాక్టర్ సిస్టర్ షైజీ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రవేశాలు పొందాలని ఆమె కోరారు.
మరింత సమాచారం కోసం:
సెయింట్ జోసెఫ్స్ మహిళా కళాశాల, విశాఖపట్నం
ఫోన్: 91 94917 89574

Comments
Post a Comment