విశాఖపట్నం, జూన్ 29: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి, ఉక్కునగరం విద్యా విభాగం ఆధ్వర్యంలో బాలవికాస్ విద్యార్థుల పట్టాభిషేకోత్సవం (Convocation) మరియు తల్లిదండ్రుల అవగాహన సదస్సు నిన్న (జూన్ 28) సెక్టార్–2లోని శ్రీ సత్యసాయి మందిరంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కార్యక్రమం ఓంకారం, వేదపారాయణం, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలవికాస్ గ్రూప్–1, గ్రూప్–2 విద్యార్థులకు భగవాన్ దివ్య సన్నిధిలో సర్టిఫికెట్లను అందజేశారు.
అనంతరం శ్రీమతి జయశ్రీ గణేశన్ తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి, బాలవికాస్ లక్ష్య సాధనలో తల్లిదండ్రుల పాత్రను చార్టులు, వివిధ కార్యాచరణల ద్వారా సులభంగా వివరించారు.
బాలవికాస్ గ్రూప్–1, 2, 3 విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు నిర్వహించిన ప్యానెల్ చర్చలు బాలవికాస్ కార్యక్రమం విశిష్టతను చక్కగా ప్రతిబింబించాయి. వారి ప్రదర్శనలు తల్లిదండ్రులు, భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
శ్రీమతి జయ గౌరీ కామేశ్వరి శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆశయాలు, లక్ష్యాలను వివరించారు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల్లో వచ్చిన సానుకూల మార్పులను ప్రస్తావిస్తూ, నిస్వార్థ సేవతో వారి వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తున్న బాలవికాస్ గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల సీనియర్ పదాధికారులు, తల్లిదండ్రులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బాలవికాస్ కార్యక్రమాన్ని అభినందించారు.
భగవాన్‌కు మంగళహారతితో కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో మొత్తం 70 మంది బాలవికాస్ విద్యార్థులు, 50 మంది తల్లిదండ్రులు, 8 మంది గురువులు, 30 మంది భక్తులు పాల్గొన్నారు


Comments
Post a Comment