Skip to main content

ఆకాశమే హద్దుగా ఎమ్మెల్యే ఆనందరావు పుట్టినరోజు వేడుకలు. జన సునామీని తలపించిన ఆంధ్ర గోవా బీచ్...

.               SRINIVAS  SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...
ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు జన్మదిన వేడుకలు, కూటమి 2 ఏళ్ల విజయోత్సవంలో భారీ సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చిన జనసైనికులు,తెలుగు తమ్ముళ్లు,బీజేపీ నాయకులు, అభిమానులు.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయ వంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని, అలాగే అమలాపురం నియోజక వర్గ శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సూరసేన యానాం, 


*ఆంధ్రా గోవాగా పిలవబడే 'కోకో బీచ్'* వద్ద అత్యంత వైభవంగా *కూటమి విజయోత్సవ విందు* కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకలో అమలాపురం నియోజక వర్గ పరిధిలోని తెలుగుదేశం, జనసేన,బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు,నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు,తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు,బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే అభిమానులు దాదాపు భారీ సంఖ్యలో తరలిరావడంతో కోకో బీచ్ తీరమంతా జనసంద్రంగా మారింది.సముద్రపు అలల సవ్వడి మధ్య "జై హో కూటమి", "జై ఆనందరావు" అంటూ కార్య కర్తలు చేసిన నినాదాలతో కోకో బీచ్ పరిసర ప్రాంతాలన్నీ పండగ వాతావరణాన్ని తలపించాయి. టిడిపి,జనసేన, బిజెపి శ్రేణులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి,గత రెండేళ్ల కూటమి పాలన సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ ఈ విజయ విందులో పాలుపంచుకున్నారు. అనంతరం అభిమానులు,కార్యకర్తల కోలాహలం మధ్య ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు జన్మదిన కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులు,కార్యకర్తలు ఆయనకు గజ మాలలతో,శాలువాలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న ఈ శుభ సమయంలో


 నా పుట్టినరోజు వేడుకలను ఇంత అద్భుతంగా,పండగలా నిర్వహించిన నా కూటమి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో, సీ.ఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీ.ఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని గుర్తు చేశారు.నాపై మీకున్న ఈ ప్రేమాభి మానాలే నన్ను మరింత బాధ్యత గా ప్రజాసేవ చేసేలా నడిపిస్తాయని,అమలాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నా సేవలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నియోజకవర్గ, మండల స్థాయి ముఖ్య నాయకులు,అనుబంధ సంఘాల ప్రతినిధులు,స్థానిక ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments