Skip to main content

జననేతను కలిసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి...

             K.V.SHARMA EDITOR 


జనహృదయనేత వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కలిశారు. తాడేపల్లిగూడెం నివాసంలో మంగళవారం ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్ కలసి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకలాపాలు, రాజకీయ అంశాల పట్ల కాసేపు ముచ్చటించారు. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సిపి గెలుపే లక్ష్యంగా దక్షిణ నియోజకవర్గ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని వాసుపల్లి జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు.

Comments