Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. పైడితల్లి అమ్మవారి జాతరలో ఆకట్టుకున్న ‘సత్యహరిశ్చంద్ర’ నాటక ప్రదర్శన

                        K.V.SHARMA EDITOR 


సింహాచలం, జూన్ 8: శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి సోదరి శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ అమ్మవారి వార్షిక పండుగ మహోత్సవాల సందర్భంగా సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన ‘సత్యహరిశ్చంద్ర’ పౌరాణిక నాటక ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 

గుంటూరుకు చెందిన శ్రీ శివశక్తి నాట్య మండలి కళాకారులు హృద్యంగా ప్రదర్శించిన ఈ నాటకాన్ని భక్తులు, గ్రామస్తులు, ముఖ్యంగా వృద్ధులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు.

కళాకారులను సన్మానాస్తు ఆలయం ఇఓ వెంకటరావు మాట్లాడుతూ,ఈ పౌరాణికనాటకంలోని అత్యంత హృదయ విదారక ఘట్టమైన శ్మశాన వాటిక సన్నివేశం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. సత్యం కోసం రాజ్యాన్ని, సంపదను, కుటుంబాన్ని సైతం త్యాగం చేసిన హరిశ్చంద్రుడు శ్మశానంలో కాటికాపరిగా విధులు నిర్వర్తించే సందర్భంలో, తన స్వంత కుమారుడు లోహితాస్యుడు మరణించగా అతని దేహాన్ని తీసుకుని వచ్చిన భార్య చంద్రమతిని గుర్తించినప్పటికీ ధర్మాన్ని విడిచిపెట్టకుండా శ్మశాన రుసుము కోరే దృశ్యం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.

కళాకారుల హావభావాలు, సంభాషణలు, సంగీతం ఆ ఘట్టానికి మరింత జీవం పోశాయి. అనివ్యాఖ్యానించారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. 

కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు  డీఈ ఇన్‌చార్జి రామరాజు, పర్యవేక్షణ అధికారులు నరసింగరావు, జోగారావు, మూలవాసు, పీఆర్వో నాయుడు, సిబ్బంది చక్రవర్తి, రాజు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Comments