Skip to main content

శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం – ఆలయ ఈఓ జల్లేపల్లి వెంకట్రావు

K.V..  Sharma 
సింహాచలం, జూన్ 19, 2026: శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, సేవల నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబుతో కలిసి రూ.100, రూ.300 ప్రత్యేక దర్శన క్యూలైన్లను పూర్తిగా పరిశీలించారు.


క్యూలైన్లలో ఏర్పాటు చేసిన ప్రతి వాటర్ పాయింట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి, భక్తులకు నిరంతరాయంగా తాగునీరు అందుతున్నదీ లేదీ పరిశీలించారు. క్యూ లైన్ లో ఏర్పాటుచేసిన వాటర్ కూలర్ లోని వాటర్ను స్వయంగా తాగి చూశారు అలాగే 

శానిటరీ సదుపాయాలను పరిశీలించి, గుర్తించిన చిన్న చిన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


అనంతరం ఉచిత ప్రసాదాల పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన ఈఓ, స్వయంగా ప్రసాదాన్ని స్వీకరించి రుచి పరిశీలించారు. అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడి దర్శన ఏర్పాట్లు, టికెట్ బుకింగ్ విధానం, ప్రసాద నాణ్యత తదితర అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.


ప్రసాద నాణ్యత, దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ, దేవస్థానం అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇంటి వద్ద నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా దర్శన టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఈ సేవలపై భక్తుల నుంచి సానుకూల స్పందన రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.


అదేవిధంగా అన్నదాన భవనాన్ని సందర్శించిన ఈఓ, అక్కడ ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థను పరిశీలించి,  నాణ్యత, భద్రతా ప్రమాణాల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.


భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, పారదర్శకమైన సేవలు అందించేందుకు దేవస్థానం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆలయకార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.

Comments