Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. ​శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ. యుద్ధ ప్రాతిపదికన మార్గాల మరమ్మతులు క్షేత్రస్థాయిలోపరిశీలన ..............................ఈవో జల్లేపల్లి

.                   K.V.SHATMA EDITOR 
సింహాచలం, జూన్ 5, 2026:ప్రతిష్టాత్మకమైన సింహాచలం గిరి ప్రదక్షిణ జూలై 28-29 తేదీలలో జరగనున్న నేపథ్యంలో, లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసేందుకు దేవస్థాన యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, గిరి ప్రదక్షిణ మార్గంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, శుక్రవారం ఉదయం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  శ్రీ జల్లేపల్లి వెంకట్రావు  ఇంజనీరింగ్ అధికారుల బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.


ఈ పర్యటనలో ఈఈ బండారు రాంబాబు, డిప్యూటీ ఇంజనీర్ ఇన్‌చార్జ్ రామరాజు మరియు ఇతర ఏఈలు పాల్గొన్నారు.


సీతమ్మధార, మురళీనగర్, మాధవధార, ఎన్‌ఎస్‌టీఎల్ గేట్, సుసర్శ కాలనీ మరియు ఇందిరానగర్ ప్రాంతాలలో గిరి ప్రదక్షిణ మార్గం ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉంది. పలుచోట్ల అభివృద్ధి పనుల కోసం తవ్విన రోడ్లు ఇంకా పూర్తికాకపోవడం, రాళ్లు తేలి నడవడానికి ఇబ్బందికరంగా మారడం తో,క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులను వేగవంతం చేయటానికి

క్షేత్రస్థాయి పర్యటన ద్వారా సేకరించిన నివేదికను, అవసరమైన ప్రతిపాదనలతో కలిపి జిల్లా కలెక్టర్ మరియు జీవీఎంసీ  కమిషనర్‌కు తక్షణమే సమర్పించనున్నట్లు ఈవో తెలిపారు. 


జిల్లా రెవెన్యూ, జీవీఎంసీ, విద్యుత్ శాఖ మరియు దేవస్థాన యంత్రాంగం సమన్వయంతో పనిచేసి, గిరి ప్రదక్షిణ  రోడ్లు మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.

​గిరి ప్రదక్షిణకు ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉన్నందున, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రాధాన్యతతో పనులు పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పి.ఆర్.ఓ విభాగం,

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం.

Comments