ఒమన్ దాడిలో మృతి చెందిన పట్నాల సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం.ఎం.ఎన్. పరశురామరాజు*
K.V.SHARMA EDITOR
విశాఖపట్నం: పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని శ్రీహరిపురం, శ్రీనివాసనగర్‌కు చెందిన విశాఖవాసి, మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ ఇటీవల ఒమన్ దేశంలో జరిగిన దాడి ఘటనలో మృతి చెందడం పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో, మృతుడి కుటుంబ సభ్యులను బిజెపి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం.ఎం.ఎన్. పరశురామరాజు గారు స్వయంగా వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు.
అనంతరం శ్రీ ఎం.ఎం.ఎన్. పరశురామరాజు గారు మాట్లాడుతూ... సురేష్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ముమ్మరంగా కృషి చేస్తోందని తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో బాధిత కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా అండగా నిలబడుతుందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ముందుంటుందని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొక్కిలిగడ్డ విజయబాబు, బీజేపీ SC మోర్చా జిల్లా అధ్యక్షులు ములకలపల్లి ప్రకాష్, కరకవలస సంతోష్ కుమార్ తదితరులు పరామర్శించారు




Comments
Post a Comment