Skip to main content

విశాఖ నావికుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గణబాబు*

.                       K.V.SHARAMA EDITOR 
 ఓమాన్ తీరంలో భారతీయ నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శ్రీహరిపురానికి చెందిన నావికుడు *పట్నాల సురేష్* కుటుంబాన్ని ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే *గణబాబు*  గారు పరామర్శించారు.

శ్రీనివాస్ నగర్‌లోని సురేష్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే గారు, ఆయన భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులను కలిసి తీవ్ర దిగ్భ్రాంతిని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో ప్రభుత్వం  సురేష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సురేష్ మృతదేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి తీసుకువచ్చేలా అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వార్తతో శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments