శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం. సింహాచలంలో ఘాట్ రోడ్డు, మెట్ల మార్గాల విస్తరణ పనులపై ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణుల క్షేత్రస్థాయి పరిశీలన. ఈవో జల్లేపల్లి వెంకట్రావుతో సమావేశమైన ఐఐటీ ప్రొఫెసర్లు
సింహాచలం, జూన్ 10, 2026:సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న ఘాట్ రోడ్డు విస్తరణ, మెట్ల మార్గాల అభివృద్ధి మరియు రవాణా సదుపాయాల మెరుగుదలకు సంబంధించి ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణుల బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది.
ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావుతో ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన ప్రముఖ నిపుణులు సమావేశమై ప్రతిపాదిత పనులపై సుదీర్ఘంగా చర్చించారు.
పరిశీలన బృందంలో ప్రొఫెసర్ డా. దేవాశిస్ రాయ్ – జియోటెక్నికల్ ఇంజినీరింగ్ నిపుణుడు ప్రొఫెసర్ డా. సుజిత్ కుమార్ దాస్ – జియోటెక్నికల్ ఇంజినీరింగ్ నిపుణుడుప్రొఫెసర్ డా. ఎం. అమరనాథ రెడ్డి – ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ నిపుణుడుపాల్గొన్నారు.
నిపుణుల బృందం ఆలయ కొండపై ఉన్న ప్రస్తుత మెట్ల మార్గం, ఘాట్ రోడ్డు, రాకపోకల పరిస్థితులు, భూగర్భ నిర్మాణ స్వరూపం, భౌగోళిక పరిస్థితులు, భక్తుల రద్దీ తదితర అంశాలను పరిశీలించింది. భవిష్యత్తులో చేపట్టవలసిన విస్తరణ, అభివృద్ధి పనులకు అనువైన సాంకేతిక సూచనలను అందించేందుకు అవసరమైన వివరాలను సేకరించింది.
ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఘాట్ రోడ్డు నిర్మాణ వివరాలు, నిర్వహణ అంశాలు, ట్రాఫిక్ గణాంకాలు మరియు ఇతర సాంకేతిక సమాచారాన్ని నిపుణుల బృందానికి అందజేశారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణులు తమ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సమగ్ర సాంకేతిక నివేదికను సిద్ధం చేసి దేవస్థానానికి అందజేయనున్నారు. ఆ నివేదికలో సూచించిన సిఫార్సులు, సాంకేతిక మార్గదర్శకాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టబడతాయి.
ఈ పనుల సమన్వయం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ i/c రామరాజ, మరియు దేవస్థానం ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుందని ఈవో శ్రీ జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శాస్త్రీయ విధానంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం దేవస్థానం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.



Comments
Post a Comment