K.V.SHARMA EDITOR
విశాఖపట్నం : విశాఖ సందేశం వార్తలు :జూన్ 14సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ R. లక్ష్మణరావు గారి సూచనల మేరకు *బ్యాక్ టూ బేసిక్స్* అన్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రెండో ఆదివారం (14-06-26)
శ్రీ సత్యసాయి సేవా సమితి, ఉక్కునగరం దత్తత గ్రామం యలమంచలి దొడ్డి, నమ్మి దొడ్డి గ్రామాలలో ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి యూత్ కోఆర్డినేటర్ శ్రీ K. ప్రకాష్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరిగినవి.గ్రామంలో ఉన్న గ్రామ దేవత మందిరం పరిశుభ్రపరిచి,
అక్కడ ఉన్న మొక్కలకు నీరు నిల్వ ఉండేలా మొక్కల చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం నామసంకీర్తన చేసారు. అక్కడ నిరుపేద
నిస్సాయులకు 6 గురికి అమృతకలశాలు(నెలకు సరిపడా కిరాణా సామగ్రి) 10 మందికి వృద్దులకు పాదరక్షలు, 10 మంది వృద్దులకు గొడుగులు,
స్కూల్ విద్యార్థులకు 50 మందికి ఒక్కొక్కరికి 5 నోట్స్ బుక్స్ పంపిణీ చేసారు. అనంతరం పులిహోర ప్రసాద వితరణ చేసారు. ఇందులో సమితి జాయింట్ కోఆర్డినేటర్స్ *శ్రీ K.V.రమణ, శ్రీమతి జయకామేశ్వరావు గారు, K. రామచంద్రరావు, Narayayana Rao మరియు సమితి సేవాదళ్, youth, మహిళా యూత్ కోఆర్డినేటర్ కుమారి కే సాయి విద్య*, గ్రామ సభ్యులు పాల్గొన్నారు.





Comments
Post a Comment