Skip to main content

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

 పర్యావరణ 

పరిరక్షణ 

ప్రతీ పౌరుని 

బాధ్యత.

విశ్వ మానవాళి 

భవిష్యత్తు,

అభివృద్ధి 

పర్యావరణం తో 

ముడిపడి ఉంది.

అను నిత్యం 

ప్రతీ పౌరుని 

ఇంటి ముంగిట/

ఆవరణ నుంచి 

మొదలయ్యేది 

పర్యావరణo,

పరిశుభ్రత.

ప్రపంచం లోని 

ప్రతీ పౌరుని 

విధి పర్యావరణ 

పరి రక్షణ.

ప్రకృతిని 

ప్రేమించాలి,

ఆరాధించాలి,

అనుసరించాలి,

ఆచరణ యోగ్యం 

గా మరల్చాలి.

ప్రకృతి సహజ 

సిద్ధంగా మానవాళి 

కి లభించిన వరం.

ప్రకృతిని 

పరిరక్షించు 

కోక పోవడం 

మూలాన 

మానవాళి 

అనర్ధాలకు,

ప్రకృతి ప్రకో 

పాలకు గురి 

కాక తప్పడం 

లేదు. మానవాళి 

మొదటి దుశ్చర్య 

ప్లాస్టిక్ వినియోగం.

ప్లాస్టిక్ వినియోగాన్ని,

వాడకాన్ని 

అరికట్టలేని 

నిస్సహాయత 

మనందరిది.

నిర్మూలనకు 

నోచుకోని నేటి 

మానవ జాతి.

ప్రభుత్వ చర్యలు 

లేవు, ప్రజల లో 

చైతన్యం అంత 

కన్నా కాన రాదు.

ప్లాస్టిక్ భూతం 

మానవాళి 

మనుగడకు 

గొడ్డలి పెట్టు.

మనిషి 

గాలి, నీరు,

నింగి, నేల,

నిప్పు ని 

పంచ భూతా 

లను కలుషితం 

చేస్తూ కారణ

భూతుడవు

తున్నాడు.

కాలుష్యపు 

కోరలనుంచి 

తనను తాను 

సమాజాన్ని 

కాపాడు లేక 

పోతున్నాడు.

పీల్చే గాలి నుంచి,

త్రాగే నీరు,

పండే పంట,

వండె వంట 

అన్నీ కలుషితం.

ప్రకృతిని 

దైవం మానవాళి 

కిచ్చిన వరం.

అసలు ప్లాస్టిక్ 

ఉత్పత్తి ని 

అరికట్టలేని 

ప్రభుత్వ చర్య 

సమంజసమా!

ఉదయం లేవగానే 

ప్లాస్టిక్ భూతం 

పాల ప్యాకెట్ 

రూపంలో 

దర్శనం.

ప్రభుత్వ

ప్రోత్సాహం 

కాదా! 

భూమి,

నదులు,

సాగర జలాలు,

జంతు జాలాలు 

గో, మత్య సంపద 

కాలుష్యానికి 

గురి కాని ప్రాణి 

నేడు కాన రాదు

ఈ మహా విశ్వం లో.

ఇక వాహన 

కాలుష్యం 

గురించి వేరే 

చెప్పనక్కర్లేదు.

చాలా మంది 

పౌరులలో 

సామాజిక 

బాధ్యతా లోపం.

ఫ్లాట్స్ లో 

నివాసముంటున్న 

వారు, వ్యర్ధాల 

కవర్స్ ని రోడ్డు 

మీదకు విసిరేస్తారు.

రోడ్ల మీద యదేచ్చగా 

ఉమ్ముతారు,

గుడ్కా, గంజాయి 

లో సేవించి.

అందరిలో 

పర్యావరణ 

పరిరక్షణ, హితం 

ఆవశ్యకత 

గురించి వివిధ 

ప్రసారాల 

మాధ్యమాల 

ద్వారా ప్రచారం 

చేయాలి.

గ్రాస్ రూట్ 

లెవెల్ నుంచి 

ప్రజానీకాన్ని 

చైతన్య 

పరచాలి,

చట్టాలను 

కఠినతరం 

చేయాలి.

ప్రాధమిక 

విద్య లో 

పాఠ్యాంశము

గా పెట్టాలి.


పర్యావరణ 

దినోత్సవ

శుభాకాంక్షలతో            

                 


                        Dr. నండూరి రామకృష్ణ

                         Sr Sub EDITOR 

                          04.06.2026

Comments