Skip to main content

విద్యా ప్రగతికి దిక్సూచి ఎస్. ఎఫ్.ఎస్. మేధా తయారీలో మేటిగా గుర్తింపు నూతన భవన ప్రారంభోత్సవంలో జి.ఎం. సురేష్ బాబు.

 


సీతమ్మ దారులోని ఎస్.ఎఫ్.ఎస్ ఉన్నత పాఠశాల విద్యా,విజ్ఞాన, రంగాల ప్రగతికి దిక్సూచిగా నిలుస్తున్నదని ప్రోవిన్సీఎల్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ జనరల్ మేనేజర్ రెవరెండ్ ఫాదర్ బి. సురేష్ బాబు అన్నారు.


 సీతమ్మధార స్కూల్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం నూతన భవనాన్ని ఆయన ముఖ్యఅతిథిగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1974లో సుమారు 245 మందితో ఆరంభమైన ఎస్ఎఫ్ఎస్ స్కూలు ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ మేధో సంపత్తిని ప్రపంచానికి అందించిందన్నారు.ఎస్.ఎఫ్. ఎస్. స్కూల్ ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ మనోజ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతున్నదన్నారు. ఎంతోమంది ఐ.ఏ.ఎస్ అధికారులను, ఇంజనీర్లు, వైద్యాధికారులను, 


విజ్ఞానవేత్తలను ప్రపంచానికి అందించిన ఘనత ఎస్ఎఫ్ఎస్ స్కూలుదన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శీను బాబు మాట్లాడుతూ ఎక్కడ మెరుగైన సౌకర్యాలు ఉంటాయో అక్కడ సత్ఫలితాలు శతశాతం ఉంటాయన్నారు.విద్యా, సాంస్కృతిక, క్రీడారంగాల్లో ఎస్ఎఫ్ఎస్ ప్రగతి స్లాగనీయమైనదన్నారు. 


నూతన భవన గ్రౌండ్ ఫ్లోర్ ను సెయింట్ ఆలోసిస్ ప్రెసిడెంట్ థామస్ పెరుమల్లి ప్రారంభించగా,మొదటి అంతస్తును బి. సురేష్ బాబు, రెండవ అంతస్తు ను రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా స్కూలు ఐఎస్ఓ సర్టిఫికేట్ ను ఎస్ఎఫ్ఎస్ జనరల్ మేనేజర్ సురేష్ బాబు స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ కు అందించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ జోజి, సీబీఎస్సీ ప్రిన్సిపల్ ఫాదర్ విజయ్,సంఘ సేవకులు దామోదర్,విజయ్ శేఖర్ భాస్కర్ రెడ్డి,వర్గీస్ జిల్లా విధ్యా శాఖధికారులు పాల్గున్నారు.

Comments