అమెరికాలోని ఆర్యా విశ్వవిద్యాలయం స్నాత కోత్సవంలో తెలుగు సాహిత్య రంగంలోని ప్రముఖ అనువాదకుడు, రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి కుమారుడు యార్లగడ్డ శివప్రసాద్ గారు తెలుగులో ఎం.ఏ. పట్టాను పొందారు.
విశాఖపట్నం:విశాఖ సందేశం:తెలుగుభాషాసాహిత్యాలకు విశిష్ట సేవలందించిన మహనీయుడైన తన తండ్రి సమక్షంలో వేదికపై ఎం.ఏ. పట్టా స్వీకరించడం ఒక అపూర్వమైన, స్ఫూర్తిదాయకమైన సందర్భం. విదేశాల్లో నివసిస్తూ కూడా స్వదేశీ మాతృభాష అయిన తెలుగుపై వారసత్వంగా సంక్రమించిన ప్రత్యేక అభిరుచిని కొనసాగించడం నిజంగా హర్షణీయమైన విషయం.
“నిజ భాషా ఉన్నతియే సమస్త ఉన్నతులకు మూలం” అనే మహావాక్యాన్ని ఆయన తన కార్యాచరణ ద్వారా సార్థకం చేశారు. మాతృభాష పట్ల ప్రేమ, గౌరవం, అనురక్తి కలిగి ఉండటం వ్యక్తి సాంస్కృతిక మూలాలను బలపరుస్తుందనే విషయాన్ని ఈ ఘట్టం తెలియజేస్తోంది.
అందువల్ల తండ్రి డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారూ, కుమారుడు యార్లగడ్డ శివప్రసాద్ గారూ ఇద్దరూ హృదయపూర్వక అభినందనలకు పాత్రులు. వారిద్దరికీ హార్దిక శుభాకాంక్షలు.
కె. వి. శర్మ, ఎడిటర్,

Comments
Post a Comment