Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచలం దేవస్థానంలో కొబ్బరి ముక్కల ప్రోగు హక్కుకు టెండర్ ఖరారు

.                    K.V.SHARMA  EDITOR 
సింహాచలం, జూన్ 8: శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో భక్తులు సమర్పించే కొబ్బరి ముక్కలను ప్రోగు చేసుకునే హక్కుకు నిర్వహించిన టెండర్ ప్రక్రియలో హెచ్ టెండర్ దారుడిగా రెడ్డి సూరిబాబు నమోదు అయ్యారు.

దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించిన టెండర్ ప్రక్రియలో సంవత్సరం ఒక్కంటికి అత్యధికంగా రూ. 66,11,999 మొత్తాన్ని కోట్ చేసిన రెడ్డి సూరిబాబు హెచ్ బిడ్డర్‌గా నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం నిబంధనల ప్రకారం టెండర్ ఖరారు చేయబడుతుందని తెలిపారు

Comments