జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాలదే* *ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరించండి* *భీమిలి జర్నలిస్టు ఆరోగ్య పరిస్థితిపై గంట్ల పరామర్శ* *ఆర్థిక సహాయం అందజేత*
భీమిలి, జూన్ 5:సమాజ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే జర్నలిస్టుల ఆరోగ్య రక్షణ భద్రత.. ప్రభుత్వాలదేనని జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి.. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు..
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWF) సభ్యుడు, భీమిలి ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు అప్పలరాజు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు .. దీంతో ఎన్నారై ఆస్పత్రిలో తక్షణమే సర్జరీ
పూర్తి చేశారు. ప్రస్తుతం వైద్య సేవలు పొందుతున్న అప్పలరాజు ను శుక్రవారం భీమిలి లోని ఆయన నివాసంలో .జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి .. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు అప్పలరాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గంట్ల శ్రీనుబాబు, వైద్యుల సూచనలను పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అప్పలరాజు త్వరగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు.
జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అలాగే ప్రభుత్వాలు కూడా ప్రమాద బీమాను పునరుద్ధరించాలని తగిన ఆరోగ్య సంరక్షణ భద్రత కల్పించాలని కోరారు.. జర్నలిస్టులకు తన పరిధి మేరకు, అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఏపీ డబ్ల్యూ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి
జి శ్రీనివాసరావు, బ్రాడ్ కాస్ట్ కార్యదర్శి కింతాడ మదన్
భీమిలి జర్నలిస్టు సంఘం నాయకులు పి రంగ ధామం.. మోహన్ రావు.. నగేష్ బాబు జర్నలిస్టు సంఘాల నాయకులు, పలువురు జర్నలిస్టులు పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు



Comments
Post a Comment