Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం గోవా రాష్ట్ర గవర్నర్, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త & చైర్మన్ గౌ: శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ...................ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు

                    K.V.SHARMA EDITOR 


: 26 జూన్ 2026శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం అనువంశిక ధర్మకర్త, దేవస్థానం చైర్మన్ మరియు గౌరవ గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం విజయనగరంలోని వారి అతిథి గృహంలో సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.


ఈ సందర్భంగా దేవస్థానం తరఫున ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు  దంపతులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సీతారామాచార్యులు మరియు వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందించి, శ్రీ స్వామివారి ప్రసాదాలు సమర్పించారు.


అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు  శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి చిత్రపటాన్ని గౌరవ గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులకు జ్ఞాపికగా అందజేశారు. 


ఈ సందర్భంగా స్వామివారి అనుగ్రహంతో వారు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని వేద పండితులు ఆశీర్వదించారు.


ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మధుపాడ సన్యాసిరావు, కరక దేముడు, నీటిపల్లి మహేష్, పెద్దిశెట్టి ఉషశ్రీ, లలిత జ్యోతి, చలమూరి భారతి శ్రీనివాస్, బండ్ల ధరణిరామ్, వెంపడపు అన్నపూర్ణ రమణ, సుసరపు గణపతిరావు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా బోకం స్వామినాయుడు హాజరై గౌరవ గవర్నర్ దంపతులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుక ఆధ్యాత్మికత, సంప్రదాయం, మర్యాదల సమ్మేళనంగా అత్యంత ఘనంగా నిర్వహించబడగా, గౌరవ గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో సింహాచలం దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి లభించాలని అందరూ ఆకాంక్షించారు

Comments