. K.V.SHARMA EDITOR
రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయ్ గారు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తనను రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభ వేదికగా సమర్థవంతంగా పని చేస్తానని చింతకాయల విజయ్ గారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చింతకాయల విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేసి, రాజ్యసభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సమర్థవంతంగా ప్రతిబింబించాలని ఆకాంక్షించారు

Comments
Post a Comment