శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచలం క్షేత్రంలో శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కోట దంపతులు
K.V.SHARMA EDITOR
విశాఖపట్నం, జూన్ 26, 2026:అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) డాక్టర్ రవి కోట, ఐ.ఏ.ఎస్.సింహాచలంలోని శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న డాక్టర్ రవి కోట దంపతులకు, ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు, సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరావు, వేద పండితులు స్వాగతం పలికారు.
ఆలయ మర్యాదలతో నాదస్వర వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆయనను ఆహ్వానించారు.
ముందుగా ఆలయంలో అత్యంత విశిష్టమైన, మహిమాన్వితమైన 'కప్ప స్తంభాన్ని' ఆయన ఆలింగనం చేసుకున్నారు. అనంతరం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని
దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరావు ఆయనను శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి ప్రసాదాన్ని, జ్ఞాపికగా స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.


Comments
Post a Comment