అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి పండుగ* *అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు* *అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించిన గంట్ల దంపతులు* *ఆలయం వద్ద ప్రసాద వితరణ శీతల పానీయాలు పంపిణీ*
K V SHARMA EDITOR
సింహాచలం :విశాఖ సందేశం :జూన్ 9 సింహాద్రి నాథుడి సోదరి.. ఏడు గ్రామాల ప్రజల ఇలవేల్పు
శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా జూన్ రెండో వారంలో నిర్వహించే ఈ పండుగను ఈ ఏడాది కూడా
సింహాచలం దేవస్థానం.. పూజారి వంశీయులు లండ వారు.. గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో
అత్యంత వైభవంగా జరిపించారు.. తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు.. అప్పటికే క్యూ లైన్ల లో ఉన్న
వేలాది మంది భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.. పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చిన భక్తులంతా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకుని ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు.. పైడితల్లి అమ్మవారితో పాటు మరో సోదరి బంగారమ్మ వారిని కూడా భక్తులంతా దర్శించుకోవడం జరిగింది.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సింహాచలం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు..
*అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించిన గంట్ల దంపతులు*
సింహాద్రి నాథుడి సోదరీమణులు శ్రీ పైడితల్లమ్మ ..బంగారమ్మవార్లకు
పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సత్తెమ్మ తల్లి.. మరిడిమాంబ అమ్మవారి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. ప్రత్యేక ఆహ్వానితులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి
గంట్ల శ్రీనుబాబు దంపతులు నూతన వస్త్రాలు సమర్పించారు.. మహిమాన్వితమైన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు..
*ప్రసాద వితరణ.. శీతల పానీయాలు పంపిణీ*
శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు ప్రసాద వితరణ.. అలాగే శీతల పానీయాలు భక్తులకు కమిటీ సభ్యులు పంపిణీ చేశారు.. శ్రీ గణేష్ యువజన సేవా సంఘం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు కూడా పాల్గొన్నారు.



Comments
Post a Comment