Skip to main content

జనసేన పార్టీ బలోపేతానికి కృషి : అమలాపురం పార్లమెంట్ అబ్జర్వర్ టీమ్ సభ్యులు జగదీష్.. అమలాపురం పార్లమెంట్ అబ్జర్వర్ టీమ్ సభ్యులుగా మట్టపర్తి జగదీష్

             SRINIVAS SPL Correspondant 

అమలాపురం, విశాఖ సందేసం....జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధ్యక్షులు పవన్ కళ్యాణ్  స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమించారు. ఇందులో భాగంగా అమలాపురం పార్లమెంట్  అబ్జర్వర్ టీమ్ సభ్యులుగా అమలాపురం మండలం పేరూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు మట్టపర్తి జగదీష్ ను నియమించారు. 


ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్కళ్యాణ్  తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీ బలోపేతానికి అహర్నిశలు పాటుబాడతామని అన్నారు. కమిటీ పెద్దల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతని  కృషి చేస్తానని అన్నారు.కమిటీ సభ్యులుగా నియమించినందుకు పార్టీ పెద్దలకు, నాయకులకు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.

Comments