శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్, సూర్యనారాయణ రాజు.
K.V.SHARMA EDITOR
సింహాచలం 19 జూన్ 2026.రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శుక్రవారం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు, సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు చైర్మన్ కి స్వాగతం పలికారు. వేద పండితులు నాదస్వర, వేదమంత్రాలతో ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చైర్మన్ ముందుగా అత్యంత మహిమాన్వితమైన 'కప్ప స్తంభాన్ని' ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం డీఈఓ సింగం రాధ, ఏఈఓ
కె. తిరుమలేశ్వరరావు లు స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపికగా స్వామివారి చిత్రపటాన్ని చైర్మన్ కి అందజేశారు.

Comments
Post a Comment