Skip to main content

వైఎస్ జగన్ పై పంతం నానాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్

             SRINIVAS SPL Correspondant 


అమలాపురం, విశాఖ సందేసం...మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పార్టీ పరిశీలకులు పాటి శివకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసం,ఈ మధ్య పవన్ కళ్యాణ్  ఒక మీటింగ్ లో ఎమ్మెల్యే లు ఎవరు మాట్లాడటం లేదని ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినందుకు ఆయన వద్ద మార్కులు కొట్టేయడానికే నానాజీ ఇటువంటి చౌకబారు, దిగజారుడు విమర్శలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడి పదవిలో ఉండి, కోట్ల మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రజానేతపై వ్యక్తిగత దూషణలకు దిగడం నానాజీ సంస్కారహీనతకు నిదర్శనమని శివకుమార్ ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి, కులం, మతం, వర్గం, రాజకీయాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను నేరుగా అందించి, విప్లవాత్మక పాలన సాగించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజాదరణను చూసి కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామాలని 

 ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన ప్రజా సమస్యలను, శాంతిభద్రతల క్షీణతను పక్కదారి పట్టించడానికే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను,దుర్మార్గలాను ప్రజలు చూస్తున్నారని వాటి డైవర్ట్ చెయ్యడానికి ఈ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.

  అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టడం చేతగాక, కేవలం వైఎస్ జగన్ పై బురదజల్లడమే ధ్యేయంగా కూటమి పార్టీలు కాలం వెళ్లదీస్తున్నారు. పంతం నానాజీ ఇప్పటికైనా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడటం నేర్చుకోవాలని పాటి శివకుమార్ హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments