Skip to main content

నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం నూకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనకాపల్లి ఎం.పీ*

.                      K.V.SHARMA EDITOR 
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సుదీర్ఘకాలం దేశానికి ప్రధానమంత్రిగా సేవలందిస్తూ భారతదేశ చరిత్రలో విశిష్ట నాయకుడిగా నిలిచారని, భగవంతుని ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ గారు బీజేపీ నాయకులతో కలిసి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గోత్రనామాలతో ఆయన ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.అలాగే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందించాలని ప్రార్థించారు.ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాల పాలనలో దేశం అనేక రంగాల్లో విశేష అభివృద్ధి సాధించి, పురోగతి పథంలో దూసుకెళ్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో భారతదేశం ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని, అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు ప్రతి పౌరునికి అందాలని, ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.


Comments