Skip to main content

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం సింహాచలంలో స్వామివారిని దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రావు మడ్డి

                    K.V.SHARMA EDITOR 


సింహాచలం, :ఛత్తీస్‌గఢ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (CSBC) చైర్మన్ శ్రీనివాస్ రావు మడ్డి నేడు సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నాడు.

ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం సహాయ కార్యనిర్వాహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణాధికారి కె. వెంకటేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. 


స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేదఘోషల మధ్య వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగాదేవస్థానంతరఫునసహాయకార్యనిర్వాహణాధికారి కె. తిరుమలేశ్వరరావు స్వామివారి శేషవస్త్రంతో చైర్మన్‌ను సత్కరించారు.అనంతరం స్వామివారి ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.

Comments