Skip to main content

సెవెంత్ డే చర్చ్ సంఘాలలో విభేదాలు.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు

.                   Srinivas SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం కరవాక నుండి సెవెంత్ డే చర్చ్ సంఘంలో సంవత్సరాల తరబడి రెండు వర్గాల  వివాదాలు నెలకొనడంతో సోమవారం కలెక్టరేట్ ప్రజా పరిష్కార వేదికలో  సంఘ మహిళలు పిర్యాదు చేశారు. సెక్షన్ సభ్యులు అండదండలతో ఒక వర్గం వారిపై మరొక వర్గం వారి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అందరూ కలిసి సంయుక్తంగా  ఆరాధన చేసుకునే మందిరంలో వివాదాల సృష్టిస్తున్నారని పాస్టర్,  కొంతమంది వ్యక్తులపై ఆరోపణలు  చేశారు.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాపై ఎటువంటి కేసులు లేకుండా అందర్నీ సమైక్యంగా ఉండేలా చూడాలని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపారు. 


కొత్తగా వచ్చిన సెక్షన్ సంఘం పెద్దలు.. సంఘంలో విభేదాలు సృష్టిస్తున్నారని మాకు న్యాయం చేయాలని న్యాయం జరగకపోతే సెవెంత్ డే  చర్చ్  సంఘం మందిరానికి తాళాలు వేసేందుకు వెనుకాడబొమని  హెచ్చరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో గెడ్డం గాయత్రి రాపాక కీర్తి,రాపాక ప్రవీణ, నేల విద్య శ్రీ,నేల మంగ, శెట్టిబత్తుల శ్యామల, కోరుకొండ సరోజ, కోరుకొండ ఝాన్సీ రాణి తదితర మహిళలు పాల్గొన్నారు

Comments