ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి.జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
. K.V.Sharma EDITOR
విశాఖపట్నం, జూన్ 28: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో – 2026 కార్యక్రమంలో భాగంగా ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులతో మాట్లాడిన కమిషనర్, 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని , పోలియో చుక్కలు చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్య రక్షణ తో పాటు ఆరోగ్యవంతమైన భావితరాలకు మనందరి బాధ్యత అని సూచించారు. పోలియో వ్యాధి నుంచి శాశ్వత రక్షణ కల్పించడంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, గతంలో పోలియో టీకాలు తీసుకున్నప్పటికీ ఈ ప్రత్యేక కార్యక్రమంలో మళ్లీ పోలియో చుక్కలు వేయించడం అత్యంత అవసరమని కమిషనర్ తెలిపారు
జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన అన్ని పల్స్ పోలియో బూత్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఏ చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అలాగే బూత్‌కు రాలేని చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయడానికి ప్రత్యేక బృందాలు సేవలు అందిస్తాయని, ప్రజలు వారికి పూర్తి సహకారం అందించాలని కోరారు.

ఆదివారం ఆయన జీవీఎంసీ సౌత్ జోనల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ బూత్‌ను జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్ ఎస్ వర్మ తో కలిసి సందర్శించి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా తల్లిదండ్రులతో మాట్లాడిన కమిషనర్, 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని , పోలియో చుక్కలు చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్య రక్షణ తో పాటు ఆరోగ్యవంతమైన భావితరాలకు మనందరి బాధ్యత అని సూచించారు. పోలియో వ్యాధి నుంచి శాశ్వత రక్షణ కల్పించడంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, గతంలో పోలియో టీకాలు తీసుకున్నప్పటికీ ఈ ప్రత్యేక కార్యక్రమంలో మళ్లీ పోలియో చుక్కలు వేయించడం అత్యంత అవసరమని కమిషనర్ తెలిపారు
జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన అన్ని పల్స్ పోలియో బూత్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఏ చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అలాగే బూత్‌కు రాలేని చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయడానికి ప్రత్యేక బృందాలు సేవలు అందిస్తాయని, ప్రజలు వారికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, జీవీఎంసీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వాలంటీర్లు సమన్వయంతో పనిచేస్తున్నారని కమిషనర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో సౌత్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ

Comments
Post a Comment