నగరంలోని వీఐపీ రోడ్డులో గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ‘నువా’ వజ్రాభరణాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సతీమణి, ఏయÖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పల్లా లావణ్య ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సంస్థ కోస్తా ఆంధ్రా జోనల్ హెడ్ ఫెబిన్ ఆధ్వర్యంలో ‘నువా’ వజ్రాభరణలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పల్లా లావణ్య మాట్లాడుతూ, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలను రూపొందించడంలో మలబార్ సంస్థ ప్రత్యేకతను కలిగి ఉందన్నారు. చాలా సంవత్సరాల నుంచి తాను మలబార్ సంస్థ కొనుగోలుదారుగా ఉన్నానని చెప్పారు. ‘నువా’ పేరుతో మలబార్ సంస్థ రూపొందించిన వజ్రాభరణాలను విశేషంగా ఆకట్టుకుంటా యన్నారు. సహజసిద్ధమైన వజ్రాలతోనే ఆభరణాలను రూపొందించడం ఆ శ్రేణి ప్రత్యేకతన్నారు. అంతే కాకుండా సంస్థ సామాజిక బాధ్యతగా లాభాల్లో మÖడు శాతం కాకుండా అయిదు శాతం నిధులను వివిధ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు.
షోరూం ప్రతినిధులు మాట్లాడుతూ, బంగారు, వజ్రాభరణాలను అత్యంత నాణ్యంగా రూపొందిస్తామని, అందువల్లే కొనుగోలుదారుల అభిమానాన్ని తమ సంస్థ చొరగొనగలిగిందని చెప్పారు. తాజాగా ఆవిష్కరించిన ‘నువా’ వజ్రాభరణాలు 14,18 కేరెట్ల బంగారంతో లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు సుబ్రహ్మణం సునీత తదితరులు పాల్గొన్నారు. పలువురు మోడల్స్ ఆభరణాలను ధరించి సందడి చేశారు.




Comments
Post a Comment